About the Author - ఈ కృతి కర్తను గురించి

ఉత్తమ వైద్య

పమ్మి సత్యనారాయణ శాస్త్రి

వైద్య పమ్మి సత్య నారాయణ శాస్త్రి గారు రసాచార్య కీ.శే. చివుకుల సత్యనారాయణ శాస్త్రి గారి దోహిత్రులు. వృత్తిరీత్యా భారతీయ రైల్వేలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పదవీ విరమణ చేసి, అనువంశికంగా సంక్రమించిన ఆయుర్వేదానికి ఇతోథికంగా సేవ చేస్తున్నారు.

వీరు బహు గ్రంథకర్త, సంపాదకులు, ప్రచురణకర్తలు. వీరు తెలుగులో 100కి పైగానూ, ఇంగ్లీషులో 14 పుస్తకాలు ప్రచురించారు. వీరిని అనేక సంస్థలు గౌరవించాయి. వీరు చేసిన అపురూప సేవలలో కొన్ని:-

  • హారీత ఆయుర్వేదకేంద్రం ద్వారా 1980 నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

  • డా|| ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద గ్రంథాలయాన్ని స్థాపించి నిర్వహిస్తున్నారు.

  • వివిధ రాష్ట్రాలలో ఆయుర్వేద అధ్యయన పర్యటనలను నిర్వహించారు.

  • ఆయుర్వేద కళాశాల విద్యార్దులకు ఆయుర్వేద క్విజ్, వ్యాసరచన , వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

  • జనవరి 2002 నుండి నిర్విఘ్నంగా వరుసగా ప్రతినెలా మూడవ ఆదివారం నాడు

- మూలిక / ఔషధయోగ సంభాషా పరిషత్తులను నిర్వహిస్తున్నారు.

  • 40 సంవత్సరాలు శ్రమించి తెలుగులో ప్రచురింపబడని అపురూపమైన ఆయుర్వేద నిఘంటువును సంకలనం చేసి కొంత కొరతను తీర్చారు.

వీరిని గూర్చి "The Hindu" లో ప్రచురించిన వ్యాసం.